30 July, 2026 | 6:11 PM

మంథనిలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం

30-07-2026 05:11 PM

ఆగస్టు 7 వరకు దరఖాస్తులకు అవకాశం

మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని 049 అభ్యాసకుల సహాయ కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ ప్రవేశాల పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అభ్యాసకుల సహాయ కేంద్రం సమన్వయకర్త కర్నాటి కృష్ణ మాట్లాడుతూ, బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమైనట్లు తెలిపారు. ఇంటర్మీడియెట్, ఓపెన్ ఇంటర్, రెండేళ్ల ఐటీఐ, పాలిటెక్నిక్ లేదా 10+2 అర్హత కలిగిన విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు.

ప్రవేశాలకు ఆగస్టు 7 వరకు గడువు ఉందని, యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే పదో తరగతి, ఇంటర్ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అభ్యాసకుల సహాయ కేంద్రంలో నేరుగా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రెండో, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజులను సకాలంలో చెల్లించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 73829 29649 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.