7 May, 2026 | 4:12 AM

బాలల హక్కులను కాలరాస్తే ఉపేక్షించం

07-05-2026 12:00 AM

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి 

మెదక్, మే 6 (విజయక్రాంతి) : బాలలు సురక్షితంగా, ఆరోగ్యంగా, గౌరవప్రదంగా ఎదగడానికి అవసరమైన అన్ని హక్కులను కాపాడటం ప్రభుత్వంతో పాటు సమాజం మొత్తం బాధ్యత అని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్  స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో బాలకార్మిక వ్యవస్త, బాల్య వివాహాలు, డ్రగ్స్ నియంత్రణ, కిషోర బాలికల ఆరోగ్య అవగాహన, విద్య అవగాహన, పాఠశాలల్లో డ్రాప్ ఔట్ తగ్గించడం, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు, హాస్టల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనలు, సాధారణ ప్రసవాలు, పోక్సో కేసుల నమోదు వివరాలు, అతి ప్రమాద మైనర్ డ్రైవింగ్ అనే అంశాలపై ఉమ్మడి జిల్లా అధికారులనుంచి పలు వివరాలు అడిగి తెలు సుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. బాలల హక్కుల ఉల్లంఘన ఎక్క డ జరిగినా, ఎలాంటి ఒత్తిడులు ఉన్నా కూ డా కమిటీ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆమె గట్టిగా హెచ్చరించారు. చిన్నారులు మన సమాజానికి భవిష్యత్తు బలమైన స్థంభాలు. వారి శారీరక, మానసిక, భావోద్వేగ వికాసానికి అనుకూల వాతావరణం కల్పించడం అత్యవసరం.

అయితే ఇటీవల కొంతమంది బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ బాలలపై దౌర్జన్యాలు, బాల కార్మిక త్వం, బాల్య వివాహాలు, విద్యా హక్కుల నిర్లక్ష్యం వంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకరం అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో బాల ల రక్షణ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసేలా సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. పాఠశాలలు, హాస్టళ్లు, బాలల సంరక్షణ గృహాలు, అనాథాశ్రమాలు వంటి ప్రదేశాల్లో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహిస్తూ, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నామని వెల్లడించారు.

తల్లిదండ్రు లు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతీ ఒక్కరూ బాలల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని ఆమె పిలుపునిచ్చారు. బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు వందనా గౌడ్, చందన, సరిత, అపర్ణ, అగర్వాల్, వచన్ కుమార్ సిద్దిపేట డిఆర్‌ఓ నాగరాజమ్మ, మెదక్ అడిషనల్ ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ సిద్దిపేట అడిషనల్ ఎస్పీ, తదితరులు పాల్గొన్నారు.