కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లినట్లే: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
భానూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ భారీ ర్యాలీ
పటాన్ చెరు, జూన్ 29: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. ప్రజలకు ఇచ్చిన అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) విమర్శించారు. ఆదివారం సాయంత్రం పటాన్ చెరు మండలం భానూరు గ్రామంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరిన గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యులు ప్రవళిక నరేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరచితలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. అతి త్వరలో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు.
ప్రభుత్వం సహకరించక పోయిన నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని తెలిపారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుని ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని.. ప్రతి కార్యకర్త పార్టీ పటిష్టతకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, శ్రీనివాస్, సాగర్, శివయ్య, నాగేష్, మధు, రవి, సత్తయ్య, మాణిక్యం, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.






