పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఆర్థిక భరోసా
ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి 80 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆడబిడ్డల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాలకు ఎంతో ఆర్థిక భరోసా కల్పిస్తోందని అన్నారు.
వివాహ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే నిరుపేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా మారిందని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాల అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీ భాయ్, కౌన్సిలర్లు సలాం, నాగుబాయి,నాయకులు, సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.






