23 వరకు సిటీ పోలీస్ యాక్ట్
07-05-2026 12:00 AM
సిద్దిపేట క్రైం, మే 6: ఈనెల 8 నుంచి 23 వర కు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీ స్ యాక్ట్ అమలులో ఉం టుందని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా కమిషనరేట్‌పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రా స్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని సూచించారు. బంద్‌ల పేరిట బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపు లకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీ సుకుంటామని హెచ్చరించారు. డీజే సౌండ్ వినియోగంపై నిషేధం విధించిట్టు తెలిపారు.






