29 June, 2026 | 3:00 PM

Breaking News

లోక్ భవన్ ముట్టడికి SFI యత్నం.. నీట్‌పై నిరసన

29-06-2026 02:26 PM

హైదరాబాద్: ఎస్ఎఫ్ఐ(SFI) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో లోక్ భవన్(Lok Bhavan) కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను అడ్డుకున్న పంజాగుట్ట పోలీసులు స్టేషన్(Panjagutta Police Station) కు తరలించారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నీట్ రద్దు చేయాలి.. రాష్ట్రాలే నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలని నినాదాలు చేశారు. నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.