29 June, 2026 | 3:32 PM

కలుపు మందు పిచికారీ చేయించిన సర్పంచ్ పగడాల రమాదేవి

29-06-2026 02:51 PM

దమ్మపేట, జూన్ 29(విజయక్రాంతి): దమ్మపేట గ్రామపంచాయతీ పరిధిలో రోడ్డు వెంబడి, ఇండ్ల మధ్య ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి ఖాళీ స్థలాల నుండి పాములు వస్తున్నాయని పిర్యాదులు రావడంతో చర్యలు చేపట్టిన గ్రామ పంచాయతీ సర్పంచ్ పగడాల రమాదేవి. సోమవారం మోడల్ కాలనీ వాటర్ ట్యాంకు ప్రాంతం నుండి కలుపు మందు కొట్టే కార్యక్రమం ను సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు. కలుపు మందు పిచికారి చేయడం వలన అనవసరమైన కలుపు మొక్కలు పెరగకుండా నిరోధించ వచ్చుని, తద్వారా దోమల బెడద నుంచి గ్రామాన్ని కాపాడ వచ్చుని, 100% స్వచ్ఛ గ్రామంగా దమ్మపేట గ్రామ పంచాయతీని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సర్పంచ్ రమాదేవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, వార్డు సభ్యులు పానుగంటి లక్ష్మణ్ గౌడ్, గోళ్ళ భవాని కృష్ణ యాదవ్, చిన్నశెట్టి నాగలక్ష్మి ముక్తేశ్వరరావు, పంచాయతీ సిబ్బంది మహాదేవ సాయి, పగడాల గోపి తదితరులు ఉన్నారు.