29 June, 2026 | 3:00 PM

Breaking News

మేం ఎప్పుడూ రైతుల గురించే ఆలోచిస్తాం: మంత్రి తుమ్మల

29-06-2026 02:09 PM

పశ్చిమాసియా సంక్షోభంలోనూ ఎరువులిచ్చాం

ఖమ్మం:  గతేడాది రైతులకు సకాలంలో యూరియా అందించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao ) ఖమ్మంలో నిర్వహించిన మీడియాలో సమావేశంలో పేర్కొన్నారు. రైతులు ఇంటివద్దే ఉండి ఎరువులను బుక్ చేసుకుంటున్నారని మంత్రి వివరించారు. మీ ఏరియాలో ఎన్ని ఎరువులు ఉన్నాయో యాప్ లోనే చూసుకోవచ్చని వివరించారు. పశ్చిమాసియా సంక్షోభంలో కూడా సకాలంలో ఎరువులు ఇచ్చామని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఎప్పుడూ రైతుల గురించే ఆలోచిస్తామని తెలిపారు. రైతులను ఆందోళనకు, గందరగోళానికి గురి చేయవద్దని హెచ్చరించారు. యాప్ ద్వారా పారదర్శకంగా ఎరువులు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఇటీవల కేంద్రమంత్రిని కలిసి అడిగిన ఎరువులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.

వర్షాల కారణంగా సభ రద్దుయిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రేపు రూ. 9 వేల కోట్ల రైతుభరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ రైతులకు నిధులు ఎగ్గొట్టిందని ఆరోపించారు. బీఆర్ఎస్ రూ.72 వేల కోట్లు మాత్రమే వేసిందన్నారు. తాము రెండేళ్లలో రూ. 36 వేల కోట్ల రైతు భరోసా వేశామని తెలిపారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలప్పుడే బీఆర్ఎస్ రైతు భరోసా వేసిందని విమర్శించారు. భారీగా పంటలు కొనుగోళ్లు చేశామని మంత్రి వెల్లడించారు.