7 May, 2026 | 3:09 AM

సంగారెడ్డి తారా డిగ్రీ కాలేజ్‌లో మెగా జాబ్ మేళా

07-05-2026 12:00 AM

కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్, మే 6 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 8న ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాతిప్రాదికన సంగారెడ్డి జిల్లాలోని తారా డిగ్రీ కాలేజ్ లో మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబందించిన పోస్టర్ను  కలెక్ట ర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఎంపిడిఓలు, పంచాయత్ సెక్రటరీల ద్వారా గ్రామాలలో చాటింపు చేయిం చాలని, మెదక్ జిల్లాలో గల గ్రామాలలో ఉన్న నిరుద్యోగ యువత

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  కోరారు. satg.telangana.gov.in/prajapalana 3 వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకొని 08-05-2026 రోజున సంగారెడ్డి జిల్లా లో గల తారా డిగ్రీ కాలేజ్‌లో జరిగే మెగా జాబ్ మేళాలో పాల్గొనాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్  మెంచు నగేష్, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా పంచాయత్ అధికారి యాదయ్య, జిల్లా యువజన, క్రీడ ల శాఖ అధికారి రమేష్ గంగాల, ఉపాధి కల్పన అధికారి రామరాజు, పరిశ్రమల శాఖ అధికారి ప్రకాశరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారులు, ఎంపిడిఓలు, తహసీదార్లు పాల్గొన్నారు.