30 March, 2026 | 3:48 AM

దళిత ఎమ్మెల్యేపై దౌర్జన్యం సహించం

30-03-2026 12:28 AM
  1. కడియంపై కౌశిక్‌రెడ్డి అహంకార ధోరణి సరికాదు
  2. మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): శాసనసభలో దళిత ఎమ్మెల్యేల గౌరవాన్ని దె బ్బతీసే విధంగా దౌర్జన్యం చేస్తే సహించబోమని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. సీనియర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చిటికెలు కొడుతూ, చేతులు చూపి స్తూ బెదిరింపులకు దిగడం అసెంబ్లీ సంప్రదాయాలకు విరుద్ధమని మండిపడ్డారు.

ప్రస్తుతం బీఆర్‌ఎస్ నాయకులు ఒకే అజెండాతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకోవడం తగదని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో గత 10 ఏళ్ల అవినీతిపై సీబీసీఐడీ వి చారణకు హౌస్ కమిటీ వేస్తామన్నారు. దళితుల గౌరవాన్ని కాపాడటంలో ప్రభుత్వం రాజీ పడదని, చర్యలు తప్పవని అన్నారు.