18-02-2026 08:42:22 PM
మంథని,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో జిల్లాలపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని గ్రామ సర్పంచ్ గడ్డం రాజేశం, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీలు అన్నారు. బుధవారం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి సర్పంచ్ రాజేశం గ్రామ ప్రజలు, బాలాజీ తో కలిసి బుధవారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు జిల్లెలపల్లి నూతన గ్రామ పంచాయతీ భవనానికి రూ.20 లక్షల నిధులు మంజూరయ్యాయి అని తెలిపారు. గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం గ్రామ అభివృద్ధికి ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు.
గ్రామస్తులందరూ గ్రామ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జన్నె శ్రీవాణి ప్రవీణ్, వార్డు సభ్యులు గడ్డం గట్టయ్య, చిగురు పోచయ్య, రుద్రవేణ, రేవతి, శంకర్, సిద్ధ సమ్మయ్య, అనవేన తిరుమల సాయి కుమార్, పంచాయితీ రాజ్ ఏఈ జగదీష్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు వాజిద్ పాషా, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.