calender_icon.png 18 February, 2026 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోతరాజు కుంటను వెంటనే పునరుద్ధరించాలి

18-02-2026 08:17:14 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని పోతరాజు కుంట పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లోడంగి శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశాడు. బుధవారం ఆ పార్టీ మండల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కుంటలో చెత్తను డంపింగ్ చేయడం వల్ల కుంట మొత్తం చెత్తతో నిండిపోవడంతో జాతీయ రహదారి నుండి వచ్చే వర్షపు నీరు రహదారిపైనే నిలిచిపోయి ప్రాణికులను స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు.

దీనివల్ల జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పోతరాజు కుంట పునరుద్ధరణ పనులను చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి ఎండి అక్బర్, సహాయ కార్యదర్శి జిల్లా సత్యం, పట్టణ కార్యదర్శి ఎస్కె షరీఫ్, నాయకులు దేశగొని బాలరాజు, గుండాల సత్తయ్య, పి దేవేందర్, ఏళ్ల రవి, కృష్ణ, మండే నరసింహ, కన్నెబోయిన సాయిలు, తదితరులు పాల్గొన్నారు.