దేశ ఐక్యతను చాటాలి
ములకలపల్లి,(విజయక్రాంతి): హర్ ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యతను చాటాలని బిజెపి మండల అధ్యక్షులు గుగులోతు శంకర్ పిలుపునిచ్చారు.పార్టీ ఆధ్వర్యంలో గురువారం ములకలపల్లిలో హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,యువత, మహిళలు,పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలను చేతబూని భారీ ర్యాలీ నిర్వహించారు.
దేశభక్తిని చాటుతూ జాతీయ జెండాలతో నిర్వహించిన ఈ ర్యాలీ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం,ప్రతి హృదయంలో దేశభక్తి అనే నినాదంతో ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు గుగులోత్ శంకర్ మాట్లాడుతూ ప్రతి భారతీయుడు దేశభక్తి భావంతో జాతీయ జెండాను గౌరవించాలని స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.హర్ ఘార్ తిరంగా యాత్ర కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట జాతీయ జెండా ఎగరవేసి దేశా ఐక్యతను చాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు పాలకుర్తి ప్రసాద్,ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గొడ్ల రాజు, భానోత్ మల్లేష్,గుగులోత్ జేతు తదితరులు పాల్గొన్నారు.






