14 August, 2026 | 1:15 AM

మెరుగైన వైద్య సేవలు అందించండి

13-08-2026 09:28 PM

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఏ. శ్రీనివాసులు

కోయిల్ కొండ: వైద్య సదుపాయాల కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఏ. శ్రీనివాసులు అన్నారు. గురువారం మండలం లో బూర్గుపల్లి, పార్పల్లి ఆరోగ్య ఉప కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఏ. శ్రీనివాసులు ఆకష్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమములను సమీక్షించారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నియంత్రణ కార్యక్రమం సమర్థవంతముగా అమలు చేయాలనీ ఆదేశించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రముగా ఉంచుకుంటే దోమల వలన వచ్చే వ్యాధులు నివారించవచ్చని  అన్నారు.