23 July, 2026 | 2:23 AM

డ్రగ్స్ రహిత సమాజం నిర్మించాలి

23-07-2026 12:25 AM

విజ్ఞాన్ వర్సిటీలో విద్యార్థుల ప్రత్యేక కార్యక్రమం

హదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం బీటె క్ విద్యార్థుల ఇండక్షన్ కార్యక్రమంలో భా గంగా ‘మాదకద్రవ్యాల నివారణ పర్యవసానాలు’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సహాయక సూపరింటెండెంట్లు (డీఎస్పీలు) సీహెచ్ సా యిశ్రీకాంత్, ఎం సాయిరామ్, బెజవాడ లింగారావు, అహిజ కొల్లు ముఖ్యఅతిథులు గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాలతో పాటు ఎన్‌డీపీఎస్ చ ట్టంలోని కఠిన నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్ పెడ్లర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తోటి విద్యార్థుల ఒత్తిడికి లోనుకాకుండా ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొ ఫెసర్ వైవీ దాసేశ్వరరావు, వివిధ విభాగాల డీన్లు, డైరెక్టర్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.