23 July, 2026 | 3:05 AM

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలి

23-07-2026 02:06 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 22(విజయక్రాంతి):నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టు, ఢిల్లీలో నీట్ అంశంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు బుధవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని శాంతియుత నిరసన చేపట్టారు. అనంతరం గాంధీ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ రాస్తారోకో చేప ట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.

ఘటనపై బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం, ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యామ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల మంగ, మున్సిపల్ ఫ్లో ర్ లీడర్ అబ్దుల్లా, మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్, కౌన్సిలర్లు, డీసీసీ ఉపాధ్యక్షుడు ఉబెద్ బిన్ య హియా (తారీక్), డీసీసీ కార్యవర్గ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్యూఐ, సేవాదళ్, కార్యకర్తలు పాల్గొన్నారు.