8 July, 2026 | 9:01 PM

ఘనంగా అయ్యప్ప స్వామి 11వ వార్షికోత్సవ వేడుకలు

08-07-2026 08:36 PM

ఆలయ కమిటీ ప్రెసిడెంట్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా

జవహర్ నగర్,(విజయక్రాంతి): పల్లి కట్టు శబరిమలకు కళ్ళుం, ముళ్ళుం, కాలికి మెట్టై స్వామియే అయ్యప్ప అంటూ శరణు ఘోషతో బాలాజీ నగర్ లోని అయ్యప్ప స్వామి దేవాలయం మార్మోగింది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ నగర్ లో ఘనంగా అయ్యప్ప స్వామి 11వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ చైర్మన్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, నాయకులు మేకల అయ్యప్ప , దేవేందర్ రెడ్డి, నరిశెట్టి కిరణ్ కుమార్ రెడ్డి, శెట్టి మహేష్ గుప్తా, జమాల్పూర్ నవీన్ కుమార్, మహిళా భక్తులు, కాలనీవాసులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.