20 May, 2026 | 3:46 AM

సీఎం రేవంత్‌పై వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

20-05-2026 12:00 AM
  1. వ్యక్తిగత విమర్శలు కాదు.. రైతుల కోసం మాట్లాడండి 
  2. బీజేపీ ఎంపీ అర్వింద్‌కు మంత్రి అడ్లూరి హితవు 
  3. బీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్న కాంగ్రెస్ నేతలెవ్వరో జగదీష్‌రెడ్డి బయటపెట్టాలి 

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ అర్వింద్‌కుమార్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. ప్రజా సమస్య లు, రైతాంగం, కేంద్ర నిధులు, రాష్ట్ర హక్కులపై మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదని ఆయన హెచ్చరించారు, అర్వింద్‌కుమార్ కుటుంబ రాజకీయం కాంగ్రెస్‌తోనే మొదలైన విష యం తెలుసుకోవాలని ఆయన గుర్తు చేశారు.

మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మాట్లాడాలన్నారు. బీజేపీ నిర్ణయాలు నాగపూర్‌లో కూర్చుని చేస్తారని, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల అభిప్రాయాల మేరకు ప్రజాస్వామ్యంగా నిర్ణయాలుంటాయని మంత్రి పేర్కొ న్నారు. కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌కు టచ్‌లో ఉంటే.. వారి పేర్లు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బయట పెట్టాలని అడ్లూరి సవాల్ విసిరారు. ముందు వాళ్ల కుటుంబ తగాదాలు సరిచేసుకోవాలని హితవు పలికారు.   

సీఎం రేవంత్ రెడ్డి తమ్ము ళ్ల గురించి మాట్లాడుతున్న అర్వింద్..  నిజామాబాద్‌లో మీ తమ్ముళ్లు చేసే అరాచకాల గురించి  మేము మాట్లాడలేమా..? అని మంత్రి అడ్లూరి మండిపడ్డారు. మూడో సారి అధికారం లోకి వస్తామన్న బీఆర్‌ఎస్ పార్టీ మెడలు వంచి ప్రజలను ఒప్పించి అధికారంలోకి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని మంత్రి పేర్కొన్నారు. ‘నీకు చేతనైతే కేంద్రంతో ఒప్పించి మొక్కజొన్నకు మద్దతు ధర ఇప్పించు.

33జిల్లాలో వరి ధాన్యం అన్ని గోదాం లలో నిండి పోతే ఎంపీగా ప్రధాని మోడీ తో, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో ఎందుకు మాట్లాడట్లేదు. రైతుల గురించి, వడ్ల గురించి, మొక్కజొన్నల గురించి మాట్లాడట్లేదు. 2014 నుంచి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి కేసీఆర్ ను ఎదుర్కొలేక పోయారు. రేవంత్ రెడ్డి సామాన్య జీవితం నుంచి బలమైన నాయకుడిగా ఎదిగిండు. ఎన్నికల్లో ఇచ్చిన ఇచ్చిన ఆరు గ్యారంటీ లలో నాలుగు అమలు చేసినం. మిగతా రెండు కూడా అమలు అవుతాయి ’ అని మంత్రి అడ్లూరి వివరించారు. 

ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎంపీ అర్వింద్‌కు గుండు ఉంది కాబట్టి ఎండలో తిరిగి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. మీ బీజేపీలో పంచాయితీ ఉంటే  మీరు, మీరు చూసుకోవాలి. మీ తండ్రి డీఎస్‌ను కాం గ్రెస్ పార్టీ రెండు సార్లు పీసీసి అధ్యక్షుడిని చేసింది. పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ నుంచి ఎవరు పారిపోయారో అందరికి తెలుసు. కాంగ్రెస్ అధికా రంలో లేనప్పుడు రేవంత్‌రెడ్డి పార్టీలోకి వచ్చిండు. సీఎం రేవంత్ రెడ్డి ఏవిధంగా ప్రజల గురించి ఆలోచిస్తుండో ఆయన్ని చూసి నేర్చుకో’ అని ఎంపీ అనిల్ యాదవ్ హితవు పలికారు.