20 March, 2026 | 9:03 AM

సంజూను రీప్లేస్ చేయలేం

20-03-2026 12:00 AM
  1. రోహిత్, కోహ్లీలతో పోల్చిన రియాన్ పరాగ్
  2. సవాల్‌కు సిద్ధమన్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్

జైపూర్, మార్చి 19 : ఐపీఎల్ 2026 సీజన్‌కు ఇంకా వారం రోజులే మిగిలిఉంది. దీంతో అన్ని జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మినీ వేలం తర్వాత చాలా జట్ల కూర్పు మారిపోయింది. కెప్టెన్లు కూడా మా రారు. రాజస్థాన్ రాయల్స్‌కు రియాన్ పరా గ్ సారథ్యం వహించబోతున్నాడు. గత సీజ న్‌లో సంజూ లేనప్పుడు కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన రియాన్ పరాగ్ ఇప్పుడు పూర్తిస్థాయిలో పగ్గాలు అందుకున్నాడు.

సంజూ శాంసన్ చెన్నైకి ట్రేడింగ్‌లో వెళ్లిపోవడంతో పరాగ్‌కు కెప్టెన్సీ దక్కింది. కాగా కొత్త సీజన్ కోసం సన్నద్ధమవుతున్న వేళ రియాన్ పరాగ్ మీడియాతో మాట్లాడా డు. ఈ సందర్భంగా సంజూ శాంసన్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ జట్టులో సం జూ స్థానాన్ని భర్తీ చేయలేమన్నాడు. రోహి త్, కోహ్లీలను ఎలా రీప్లేస్ చేయలేమో సంజూ శాంసన్ ప్లేస్‌ను కూడా భర్తీ చేయ డం సాధ్యం కాదన్నాడు. అందుకే తాము ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆలోచన కాకుండా అక్క డ దూకుడుగా ఆడే బ్యాటర్ కోసమే ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు.

కెప్టెన్సీ అంత ఈజీ కాదనీ, అయితే ఈ సవాల్‌కు తాను సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించాడు. అలాగే గత సీజన్ లో రాజస్థాన్ ఆటతీరుపైనా, ప్రస్తుతం జట్టు కూర్పుకు సంబంధించి కూడా రియాన్ ప రాగ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ సీజన్‌లో పక్కా ప్రణాళికతో ఆడబోతున్నట్టు చెప్పాడు. విజయాలతో ఎక్కువ మ్యా చ్‌లను ముగించడంపైనే దృష్టి సారించినట్టు తెలిపాడు.

పరాగ్‌తో పా టు మాట్లాడిన సంగక్కర కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. గత సీజన్‌లో చేజేతులా కొన్ని మ్యాచ్ లలో ఓడిపోయామని, అవి గెలిచి ఉంటే ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉండేదన్నాడు. ఈ సారి అన్ని విభాగాల్లో సమతూకంగా ఉన్నామని, ఖచ్చితంగా మంచి ఫలితాలను అందు కుంటామన్నాడు. రవీంద్ర జడేజా తమ మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తాడని సంగక్కరా ధీమా వ్యక్తం చేశాడు.