20 March, 2026 | 10:26 AM

ఐపీఎల్‌కు నాథన్ ఎల్లిస్ దూరం

20-03-2026 12:00 AM

చెన్నై, మార్చి 19 : ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు అన్ని జట్ల ను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు విదేశీ ఆటగాళ్లు దూరమవగా ఆ జాబితాలో మరో బౌలర్ చేరాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న నాథన్ ఎల్లిస్ ఐపీఎల్ 19వ సీజన్ నుంచి తప్పుకున్నాడు. గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. శిక్షణ సమయంలో కండరాలకు గాయమవడంతో అతను వైదొలిగినట్టు సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు.

డెత్ ఓవర్ స్పెషలిస్ట్ మతీషా పతిరానా స్థానంలోఎల్లిస్‌ను చెన్నై కొను గోలు చేసింది. ఇప్పుడు సీజన్ ప్రా రంభం కాకముందే  గాయం కారణంగా అతను తప్పుకోవడంతో డెత్ ఓవర్ల సవాల్‌ను అధిగమించడం చెన్నైకి సవాలే. అయితే ఎల్లీస్ స్థానాన్ని న్యూజిలాండ్ స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీతో భర్తీ చేయాలని సీఎస్కే భావిస్తోంది. ఇప్పటికే చెన్నై మేనేజ్‌మెంట్ అతడితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. మ్యాట్ హెన్రీ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు.