calender_icon.png 21 February, 2026 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం

21-02-2026 12:00:00 AM

  1. సమస్యలను చూసి భయపడి వెనక్కి వెళ్ళాం

రెండేళ్లలో చేసిన అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకెళుతున్నాం 

రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తాం 

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 26 డివిజన్లో శుక్రవారం 4వ డివిజన్ పర్యటనలో భాగంగా గడిచిన రెండేళ్లలో ప్రగతిపై మన వాడకు మన నాయిని కార్యక్రమాన్ని నిర్వహించారు.

నగర మేయర్ గుండు సుధారాణి, అన్ని శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పెద్దమ్మ గడ్డ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దత్త క్షేత్రము ఆలయ అభివృద్ధి నిర్మాణ పనులకోసం 1 కోటి రూపాయలతో శంకుస్థాపన చేశారు. పెద్దమ్మ గడ్డ ప్రధాన కెనాల్ వెంట ఉన్న రోడ్డు, బొల్లం టవర్స్, అక్షర కాలనీ, యాదవ నగర్ కాలనీలలో పర్యటించారు.

అనంతరం అంతర్గత రోడ్లు, స్వచ్ఛత, పరిశుభ్రత, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ డివిజన్ల వారీగా సమస్యలను పరిష్కరించాలని, ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. అన్ని శాఖల అధికారులతో కలిసి నేరుగా ప్రజల వద్దకే వెళుతున్నామని, గడిచిన రెండేళ్లలో జరిగిన అభివృద్ధికి ప్రజలే సాక్ష్యం అని, రెండేళ్లలో ఇంత చేసిన, మేము రానున్న రోజుల్లో ఎంత చేయగలము అని అన్నారు. కుల, మతాల పేరుతో రాజకీయం మానుకోవాలని బిఆర్‌ఎస్ ఇతర పార్టీ నేతలకు సూటిగా ప్రశ్నిస్తున్నానని అన్నారు.

భద్రకాళి ఆలయ గుడిసె వాసులకు ముసలి కన్నీరు కాలుస్తూ తప్పు దోవ పట్టిస్తున్నారని, గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వినయ్ భాస్కర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, గుడిసెలు తొలగించాలని తీర్మానం చేశారని అన్నారు. ఇప్పుడు ఆలయ అభివృద్ధి జరుగుతుంటే తనకు చెడ్డ పేరు వస్తుందని గుడిసె వాసులను పక్కతోవ పట్టిస్తున్నారని అన్నారు. ఎంతో వెనుకబడిన నియోజకవర్గం అల్లర్లు లేకుండా అభివృద్ధి చేస్తుంటే, అభినందించాల్సింది పోయి,

ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నేను రెండేళ్లలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తెచ్చిన నిధులు, అభివృద్ధి, మీరు గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధికి చర్చకు సిద్ధమని, చౌరస్తా లో చర్చకు కూర్చుందామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.