2 April, 2026 | 2:45 AM

పారదర్శకంగా అడుగులు వేస్తున్నాం

02-04-2026 12:52 AM

రంగారెడ్డి గూడలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

రాజాపూర్, ఏప్రిల్ 1 : అభివృద్ధి లక్ష్యంగా ప్రతి పని విషయంలో పార్థసికంగా అడుగులు వేస్తున్నామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రంగారెడ్డి గూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,

రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, ప్రతి అర్హులైన కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించడం లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి ఒక పెద్ద ఆస్తి అని, ఇలాంటి పథకాల ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.