2 April, 2026 | 3:47 AM

భద్రాది బ్యాంకు 1,030 కోట్ల టర్నోవర్

02-04-2026 01:40 AM

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, ఖమ్మం.. గత ఆర్ధిక సంవత్సరానికి రూ.1,030 కోట్ల టర్న్ ఓవర్ సాధించింది. ఈ సందర్బంగా, హెడ్ ఆఫీస్‌లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ చెరుకూరి కృష్ణ మూర్తి మాట్లాడుతూ.. గత 29 సంవత్సరాలుగా స్థిరమైన, క్రమమైన అభివృద్ధిని సాధి స్తూ, ప్రతి సంవత్సరం వాటాదారులకు 18% డివిడెండ్ను నిరంతరం చెల్లిస్తూ, విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిందని, తెలం గా ణ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 25 బ్రాంచ్లతో వి స్తరించిన భద్రాది బ్యాంకు మార్చి 31 నాటికి రూ.1,030 కోట్ల టర్నోవర్ సాధించడం గర్వకారణమన్నారు.

ఈ విజయానికి ప్రధాన కా రణమైన మన బ్యాంక్ వాటాదారులు, ఖా తాదారులకు, సి బ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గత డైరెక్టర్లు వ్యవస్థాపక డైరెక్టర్లు గుర్రం ఉమా మహేశ్వర్ రావు, రేఖ ల భాస్కర్, మద్ది బాబు, అర్వపల్లి నిరంజన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ గొప్ప విజయానికి పునాది వేసిన చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి, వైస్ చైర్మన్లు సన్నె ఉదయ ప్రతాప్, వేములపల్లి వెంకటేశ్వరరా వు, డైరెక్టర్లు దేవత రాజారావు, మద్ది పిచ్చ య్య, కాప్లిళవాయి జయప్రద, రాజ్ పురోహి త్ చెన్ సింగ్, రంగ నాగ శ్రీనివాస్, దా రా జీవన్, సీఈఓ దాసరి వేణుగోపాల్, హె డ్డా ఫీస్ సిబ్బంది, బ్రాంచ్ మేనేజర్లు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.