వాస్క్యులర్ న్యూరోసర్జరీపై వర్క్‌షాప్
రిన్స్ ఆధ్వర్యంలో 3వ సదస్సు
హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): న్యూరో సర్జరీ రంగంలో వస్తున్న అత్యాధునిక మార్పులను అందిపుచ్చుకుంటూ, శస్త్రచి కిత్సా నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో రెనోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ సైన్సెస్ (రిన్స్), బంజారా హిల్స్, హైదరాబాద్, పాన్ రీసెర్చ్ ఫౌండేషన్, సెరెబ్రోవా స్క్యులర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీవీఎస్‌ఐ) సంయుక్తంగా మూడవ ఎడిషన్ వర్క్‌షాప్ బుధవారం రాజేంద్రనగర్‌లోని కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. పి.వి. నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ సహకారంతో నిర్వహిస్తున్న.
ఈ ‘స్కిల్ ట్రైనింగ్ అండ్ హ్యాండ్స్ ఆన్ వర్క్ షాప్ ఆన్ వాస్క్యులర్ న్యూరోసర్జరీ‘ శిక్షణ ఏప్రిల్ 1, 2 తేదీల్లో కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి ప్యాట్రన్లుగా సీనియర్ న్యూ రోసర్జన్, నిమ్స్ మాజీ డైరెక్టర్, డా. డి. రాజా రెడ్డి; సీనియర్ న్యూరోసర్జన్, డా. ఐ. దినకర్ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా పీవీఎన్‌ఆర్టీవీయూ వైస్-చాన్సలర్, ఛైర్మన్, ప్రొ. జ్ఞాన ప్రకాశ్ ఎం హాజరై ప్రారంభించారు. విశిష్ట అతిథులుగా సీనియర్ న్యూరోసర్జన్, డా. ఐప్ చెరియన్, డీన్ ఆఫ్ ఫ్యాకల్టీస్, పీవీఎన్‌ఆర్టీవీయూ, డా.ఎం.ఉదయ కుమార్, అసో సియేట్ డీన్, పీవీఎన్‌ఆర్టీవీయూ, డా. డి. మాధురి; రిజిస్ట్రార్, పీవీఎన్‌ఆర్టీవీయూ, డా. ఏ. శరత్ చంద్ర హాజరయ్యారు.
దేశవ్యాప్తం గా ఉన్న 60 మందికి పైగా న్యూరోసర్జన్లు, ఫెలోలు, రెసిడెంట్లు పాల్గొంటున్నారు. డా.సయ్యద్ అమీర్ బాషా పస్పాలా, కోర్స్ డైరెక్టర్, క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్, న్యూరో మా డ్యులేషన్ స్పెషలిస్ట్, రెనోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో లాజికల్ సైన్సెస్ (రిన్స్) మాట్లాడుతూ.. ఈ వర్క్‌షాప్ ఉద్దేశం శస్త్రచికిత్సా ఆవిష్కరణలు, సాంకేతిక నైపుణ్యాభివృద్ధి, బహుళ విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడమే అని చెప్పా రు. డా. టీ.వి. రామకృష్ణమూర్తి, కోర్స్ డైరెక్టర్, క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ మాట్లాడుతూ.. ప్రతి శిక్షణా మాడ్యూల్‌ను నిర్మా ణాత్మకంగా, దశలవారీ (స్టెప్-బై-స్టెప్) మార్గదర్శకంతో రూపొందించామని చెప్పారు.




