2 April, 2026 | 3:19 AM

రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు

02-04-2026 01:12 AM
  1. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 685 కోట్ల రాబడి
  2. జమ్మికుంట, హుజురాబాద్‌లో వంద శాతం వసూలు

హైదరాబాద్, మార్చి (విజయక్రాంతి): రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 2025--26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.685 కోట్ల మేర ఆస్తి పన్ను వసూలైనట్టు అధికారులు వెల్లడించారు. క్యూర్ పరిధి బయటి పట్టణాలు, నగరాల్లో 2024--25తో పోలిస్తే రూ.68 కోట్లమేర ఆస్తి పన్ను వసూళ్లు పెరిగాయి. మంచిర్యాల, రామగుండం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో ఆస్తిపన్ను ఆదాయం పెరిగింది. కొత్తగూడెం, మహ బూబ్ నగర్, నల్లగొండలో కాస్తం హుజురాబాద్, జమ్మికుంటలో 100 శాతం ఆస్తిపన్ను వసూలైంది.