2 April, 2026 | 4:37 AM

బీఆర్‌ఎస్‌ని ఖతం పట్టించేందుకు కాంగ్రెస్ కుట్రలు

02-04-2026 12:53 AM

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 1 ( విజయక్రాంతి ) ప్రజల చేత ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటూనే ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పాల్పడుతూ ప్రశ్నించే బిఆర్‌ఎస్ పార్టీని కతం పట్టించేందుకు అనేక కుట్రలకు పాల్పడుతోందని అచ్చంపేట నియోజకవర్గం సమన్వయ కర్త, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ నేతల చేతిలో దాడికి గురైన అచ్చంపేట నియోజకవర్గం అంకిరోనిపల్లి గ్రామ సర్పంచ్ కొర్ర కమల సతీష్ కుటుంబాన్ని బుధవారం వారి గ్రామాలకు వెళ్లి బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి పరమార్శించి మనోధైర్యాన్ని కల్పించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నిస్తే పగలు పెంచుకొని దాడులు, కేసులు నమోదు చేస్తూ పార్టీలు మారాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఇదే వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోందని సంపూర్ణంగా బిఆర్‌ఎస్ పార్టీని లేకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలకు పాల్పడుతోందన్నారు. దాడికి గురైన సర్పంచ్ కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ అండగా ఉంటామన్నారు.