2 April, 2026 | 3:18 AM

రేవంత్‌రెడ్డి రాముడు, కేసీఆర్ రావణుడైతే శకుని ఎవరు?

02-04-2026 01:33 AM
  1. టచ్‌లోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  2. మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతి ఆశీర్వాదం తీసుకుంటా
  3. మాజీ మావోయిస్టుల ఎజెండానే మా పార్టీ ఎజెండా
  4. మీడియా చిట్‌చాట్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి రాముడు.. మాజీ సీఎం కేసీఆర్ రావణుడైతే మరీ శకుని ఎవరని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ భుజాలపై తుపాకీ పెట్టి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కాల్చారని ఆరోపించారు. మాజీ నక్సలైట్ల ఆలోచనలకు దగ్గరగా తమ పార్టీ ఎజెండా ఉం టుందని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తనతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు.

బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో చిట్‌చాట్‌లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. తమ పార్టీలో మాజీ నక్సలైట్లు కూడా చేరే అవకాశముందని, దీనికి కొంత సమయం పడుతుందన్నారు. అసెంబ్లీలో తిట్టుకోవడం తప్పా చేసిందేమీ లేదన్నారు.

ఎవరెంత అవినీతి చేశారో మా ట్లాడుతున్నారని, కల్వకుర్తి నియోజకవర్గం కురుమిద్దలో పెద్దల భూములు వదిలేసి పేదల భూ ములు లాక్కుంటున్నారని, వారికి మద్దతుగా తాను పోరాడతానని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతి, ఇతర పెద్దల ఆశీర్వాదం తీసుకుంటానని, పార్టీ ఆవిర్భావం రోజు ఎజెండా చెప్పేందుకే ప్రాధాన్యత ఇస్తానన్నారు. 

రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం..

గత ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులివ్వలేదని ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం పెట్టుకుందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఐదు లక్షల రేషన్ కార్డులిస్తే పది నుం చి పదిహేను లక్షల రేషన్ కార్డులను తీ సేసే ప్రయత్నం చే స్తోందన్నారు. చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారని, ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారనే కారణాలతో కార్డులు ఏరివేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదంటూ ఆమె హెచ్చరించారు.

యువతకు ఉద్యోగాలు దక్కకుండా జీవోలతో ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆమె ఆరోపించారు. నిరుద్యోగుల నెత్తిమీద కాలు పెట్టి తొక్కుకుంటూ రేవంత్ అధికారంలోకి వచ్చారన్నారు. గ్రూప్స్‌కు జీవో నెంబర్ 29, డీఎస్సీకి జీవో నెంబర్ 104, పోలీసు నియామకాలకు జీవో నెంబర్ 46 అడ్డంకిగా మారాయన్నారు. ప్ర భుత్వం హామీ ఇచ్చినట్లుగా ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయడంలేదన్నారు. నిరుద్యోగుల సమస్యలు ఇలా ఉంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం ఆటలాడుతున్నారని మండిపడ్డారు.