రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం
16-05-2026 12:06 AM
తాడ్వాయి, మే 15 (విజయక్రాంతి): రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తాడువాయి సింగల్ విండో చైర్మన్ కపిల్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియాల్ గ్రామంలో ఆయన శుక్రవారం మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లారీలకు ఇబ్బంది లేకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతుల ఎలాంటి ఇబ్బందులు పడవద్దన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ రాజిరెడ్డి, రైతులు పాల్గొన్నారు..






