16 May, 2026 | 1:07 AM

ఎస్‌ఐఆర్‌తో ఓట్ల తొలగింపు?

16-05-2026 12:07 AM

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 

కూకట్‌పల్లి, మే 15 (విజయక్రాంతి): ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపునకు పెద్ద కుట్ర జరుగుతుందంటూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం లో కృష్ణారావు మాట్లాడారు. ఎస్‌ఐఆర్ పేరుతో కూకట్‌పల్లి నియోజ కవర్గంలో భారీగా ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు.

బూత్‌స్థా యిలో విచారణ చేప ట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఫతేనగర్ డివిజన్‌లో 351 నుంచి 366 బూత్‌లలో ఉన్న గౌతమ్‌నగర్, మాధవినగర్, నాగార్జునకాలనీ శోభనకాలనీ, పైప్‌రోడ్లలో ఓట్లను తొలగించారని ఆరోపించారు. కూ కట్‌పల్లి నియోజకవర్గంలో సుమారుగా 40 వేల ఓట్లను తొల గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.