16 May, 2026 | 1:06 AM

దొంగలు బాబోయ్.. దొంగలు

16-05-2026 12:05 AM
  1. వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు..
  2. పోలీసుల కండ్లుగప్పి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు..
  3. గ్రామాల్లో గస్తీలు ఏర్పాటు చేయాలని డిమాండ్
  4. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుస చోరీలకు అడ్డుకట్ట పడేనా..?

బాన్సువాడ, మే 15 (విజయ క్రాంతి): దొంగలు... బాబోయ్... దొంగలు...వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. తాళం వేసిన ఇండ్లు టార్గెట్ గా దొంగల ముఠా చోరీలకు పాల్పడుతుంది. రాత్రి వేళలో పోలీసులు పెట్రోలింగ్ చేసినప్పటికీ పోలీసుల కండ్లుగప్పి యదేచ్చగా చోరీలకు పాల్పడుతూ బంగారం డబ్బులు ఎత్తుకెళ్తున్నారు.

ఒక చోట నుండి మరొక చోట వరుస దొంగతనాలు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా దొంగల ముఠా ఉచ్చలవిడిగా చోరీలకు పాల్పడుతుంది. గ్రామాల్లో గ్రామస్తులు తెల్లవారుజామున వరకు కంటిమీద కునుకు లేకుండా గస్తీలను ఏర్పాటు చేస్తూ కాపలా కాస్తున్నారు. మరికొన్నిచోట్ల గస్తీలు లేక పోలీస్ పెట్రోలింగ్ లేక దొంగల ముఠాకు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. ఇన్ని వరుస దొంగతనాలు జరిగిన ఇప్పటివరకు దొంగల ముఠాను పట్టుకోవడంలో పోలీసులు విఫలమైనారని ఆరోపణలు వస్తున్నాయి.

అంతేకాకుండా ప్రజలు శుభకార్యాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్న భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలోని బీర్కూర్, వర్ని, ఎల్లారెడ్డి మండలాల్లో గత వారం రోజులుగా చోరీలు పరంపర కొనసాగుతుండడంతో ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.బీర్కూర్లో గత సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రాత్రి నాలుగు ఇళ్లలో చొరబడి తాళాలు పగలగొట్టి బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. బాధితులు ఊరెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇంట్లో బీరువాలు ఖాళీగా కనిపించడంతో ప్రజలు బెంబలిచ్చుతున్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా వర్ని మండలం శ్రీనగర్లో గత కొన్ని రోజుల క్రితం ఏకంగా ఏడు ఇళ్లలో చోరీ జరిగింది.

ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్లో ఎనిమిది ఇళ్లలో దొంగలు పడి నగదు, బంగారం దోచుకెళ్లారు. ముఖ్యంగా తాళాలు వేసి ఉన్న ఇళ్లను, ఊరికి దూరంగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు.  శ్రీనగర్, అన్నసాగర్, బీర్కూర్ ప్రాంతాల్లో వరుసగా చోరీలకు పాల్పడుతున్నా దొంగల జాడ మాత్రం తెలియడం లేదు.బీర్కూర్ పోలీస్ స్టేషన్లో కావాల్సినంత సిబ్బంది లేకపోవడమే దొంగతనాలకు ప్రధాన కారణమవుతోంది. ఉన్న కొద్దిమంది సిబ్బందితోనే స్టేషన్ నడపాల్సి రావడంతో రాత్రివేళ పెట్రోలింగ్ చేసేందుకు పోలీసులు లేరు.

దీన్ని ఆసరాగా తీసుకుని దొంగలు యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. ‘రాత్రి 10 గంటల తర్వాత ఊరిలో ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించడు‘ అని స్థానికులు ఆరోపిస్తున్నారు.వరుస దొంగతనాలతో ప్రజలు ఇంటిని విడిచి బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. పెళ్లిళ్లు, చావులకు వెళ్లినా, మనసు ఇంటి మీదే ఉంటోంది. ‘తాళం వేసి వెళ్తే వచ్చేసరికి ఇల్లు గుల్ అవుతోంది.అని మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నారు. జిల్లాలో పెరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక పోలీస్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

తాళం వేసిన ఇండ్లు టార్గెట్  గా చోరీలు..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామాల పట్టణాలు మండలాలలో తాళాలు వేసిన ఇండ్లు టార్గెట్ గా చోరీల ముఠా రాత్రి వేళలో దొంగతనాలకు పాల్పడుతున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. పక్క రెక్కీ నిర్వహించి రెండు రోజుల ముందుగానే గ్రామాల్లో పట్టణ ప్రాంతాలలో పర్యటించి చివరికి తాళం వేసిన ఇండ్లను గుర్తించి చోరీలకు పాల్పడుతున్నారని అలాంటి ముఠాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ముమ్మరంగా  పెట్రోల్ చేపట్టి చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

రాత్రి వేళలో పెట్రోలింగ్ ముమ్మారం చేయాలి..

రాత్రి వేళలో గ్రామాలలో మండలాలలో పట్టణాలలో దొంగతనాల నివారణకు ప్రత్యేకంగా పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించే వాహనాలు సైరన్ వేసుకుంటూ గ్రామాల్లో తిరగడం వలన దొంగలు పారిపోతున్నారని సైరన్ లేకుండా కుట్టుచప్పుడు కాకుండా పెట్రోలింగ్ నిర్వహించి దొంగల ముఠాను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా గ్రామాల్లో గసి బృందాలను కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా పర్ష చోరీల నివారణకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని దొంగల ముఠాను పట్టుకొని ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

వరుస దొంగతనాలతో ప్రజలు బెంబలెత్తుతున్నారు...

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పరస దొంగతనాలతో ప్రజలు బెంబేలేత్తుతున్నారు. రాత్రి వేళలో వరుస దొంగతనాలు తాళాలు వేసిన ఇండ్లు టార్గెట్ చేస్తూ దొంగల ముఠా చోరీలకు పాల్పడడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంటికి తాళం వేసి వెళ్లాలంటే ప్రజలు జంతువుతున్నారు. అంతేకాకుండా వరుస దొంగతనాలతో ప్రజలు శుభకార్యాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్న వెళ్లలేని పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా వరుస దొంగతనాలను అరికట్టాలని పోలీసులు ప్రత్యేక నిగా ఏర్పాటు చేసి దొంగల ముఠా ను పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.