15 June, 2026 | 9:56 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

100% విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నాం

22-12-2025 12:35 AM

కోదాడ, డిసెంబర్ 21(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం భారతదేశ భీమా రంగంలో ప్రస్తుతం ఉన్న విదేశీ పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంపు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏజెంట్ల అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఆదివారం కోదాడ పట్టణం బాలాజీ నగర్  ఏజెంట్ల అసోసియేషన్ భవనంలో అధ్యక్షులు కంజుల మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.

భీమా రంగంలోకి విదేశీ సంస్థలు రావడం మూలాన దేశ సంపద విదేశాలు కొల్లగొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ నిర్ణయంతో దేశీయ బీమా సంస్థలు దెబ్బ తినడమే కాకుండా సామాన్య ప్రజలు పొదుపు మొత్తాలకు రక్షణ కరువు అవుతుందన్నారు. నూతన కార్యవర్గ అధ్యక్షులుగా కంజుల మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వట్టికూటి మల్లేష్, కోశాధికారిగా పసుపులేటి చిన్న వీరయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ జోనల్ కోశాధికారి బుడిగ వెంకటయ్య, జోనల్ జాయింట్ సెక్రటరీ కొప్పోజు సూర్యనారాయణ, సౌత్ సెంట్రల్ జోన్ మెంబర్ కాంతారావు డివిజన్ అధ్యక్షులు పోతుల రామస్వామి, ప్రధాన కార్యదర్శి దొంతినేని సునీల్ కుమార్, కోశాధికారి రమణారెడ్డి కోదాడ గౌరవ సలహాదారులు పోతుగంటి వెంకటాద్రి, మధుర వెంకటరెడ్డి పాల్గొన్నారు.