28 July, 2026 | 1:47 AM

రవాణా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

28-07-2026 12:54 AM

ఎంవీఐ వెంకటరమణారెడ్డి

అయిజ, జూలై 27: అయిజలోని రైచూర్ రోడ్డు ఉత్తనూరు చౌరస్తా సమీపంలో సోమవారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, నిషేధిత వస్తువుల రవాణా, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తగిన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు.