గ్రామ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ లో చేరిన వార్డ్ సభ్యులు
11-05-2026 08:11 PM
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామ పంచాయతీ లో ఉన్న ఏడుగురు వార్డు సభ్యులు, వివిధ పార్టీ లకు రాజీనామా చేసి సోమవారం దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వీరికి సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి పార్టీ కండువా కప్పి స్వాగతం చెప్పారు. ఈ సందర్బంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ మా గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి, గెలిపించినందుకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన, పలు అభివృద్ధి పథకాలకు, ఆకర్షణ అయి, దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి , నియోజకవర్గంలో గ్రామాభివృద్ధి కొరకై చేస్తున్న వంటి, సహాయ సహకారాలకు ఆకాశతులమై కాంగ్రెస్ పార్టీలో చేరామని వారు తెలిపారు.






