ఎంఈఓ చేతుల మీదుగా సమ్మర్ క్యాంప్ ప్రారంభం
వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని పి ఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీ.హెచ్.ఎస్)లో సోమవారం సమ్మర్ క్యాంప్ శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) ప్రారంభించారు. వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
క్యాంప్‌లో భాగంగా విద్యార్థులకు ఆటలు, పాటలు, యోగా, చిత్రలేఖనం, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్యా నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ అందించను న్నారు.విద్యార్థుల్లో సృజనా త్మకత, ఆత్మవిశ్వాసం పెంపొం దించేందుకు ఇలాంటి కార్యక్ర మాలు దోహదపడతాయని ఎంఈఓ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నటరాజ్ మాట్లాడుతూ... విద్యార్థులు సెలవులను సద్వినియోగం చేసుకొని కొత్త విషయాలు నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






