calender_icon.png 5 February, 2026 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

19వ వార్డు స్వతంత్ర అభ్యర్థి ప్రచారానికి అపూర్వ స్పందన

05-02-2026 03:31:31 PM

ప్రచారంలో ముందంజలో స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి

ఆపిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం 

స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి పాట్య తిరుపతయ్య_ 

వనపర్తి టౌన్: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 19వ వార్డులో స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి పాట్య తిరుపతయ్య ప్రచారానికి అపూర్వ స్పందన వచ్చింది. గురువారం 19 వ వార్డులో జోరుగా ప్రచార కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్బంగా స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి  పాట్య తిరుపతయ్య మాట్లాడుతూ వార్డు అభివృద్దే లక్ష్యంగా పని చేస్తానని వార్డు మ్యానిఫెస్టోలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతానన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే వచ్చే నాయకుడిని కాదని అనునిత్యం అందుబాటులో ఉన్న మీ బిడ్డ అయిన నన్ను ఆశీర్వదించాలని ఆపిల్ గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీ అందించి గెలిపించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమం లో సుగూర్ మౌలాలి యాదవ్, రాజేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు