calender_icon.png 8 February, 2026 | 12:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

08-02-2026 12:03:08 AM

18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి 

కొల్లాపూర్ రూరల్, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీదేవి గౌతమ్ గౌడ్ శనివారం తమ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు వాసులు ఓటర్లు ఆమెను విశేషంగా ఆదరించారు.

ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో కొల్లాపూర్ మున్సిపాలిటీలోని మన 18వ వార్డును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుందామని కోరారు.ఈనెల 11వ తేదీన జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జిలు కొండూరు మాజీ సర్పంచ్ గోపాల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శివ, మహిళ తదితరులు పాల్గొన్నారు.