15 May, 2026 | 11:36 AM

Breaking News

నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం   •   గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత   •   సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్పష్టత   •   NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు   •   మైనర్ బాలికపై లైంగిక దాడి..   •   వాహన దారులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు   •   యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం   •   మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్   •   యువతను వ్యసనాలకు దూరం చేసేందుకే క్రికెట్ టోర్నమెంట్   •   గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి   •  

మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్

15-05-2026 10:17 AM

మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్

ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్

మంథని,(విజయక్రాంతి): మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్, గౌరవ గౌరవాధ్యక్షులుగా బొల్లవరం విజయానందరావు,ఉపాధ్యక్షులుగా జబ్బార్ ఖాన్, వెల్మ రెడ్డి శ్రీనివాస రెడ్డి, కోశాధికారిగా చేరాల రవీందర్, సహాయ కార్యదర్శులుగా చిప్ప రాజేష్, గిరివేణి రాకేష్, ప్రచార కార్యదర్శి చెలుకల యుగంధర్, కార్యవర్గ సభ్యులుగా కాశీపేట శ్రీకాంత్, నాంపల్లి శ్రీనివాస్, మాదేశి శ్రావణ్, ఆకుల రాజు, రామడుగు సాయి శ్రీనివాస్  ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మహావాది సతీష్ కుమార్ మాట్లాడుతూ సంవత్సర కాలంలో ఏర్పాటై అంచెలంచెలుగా ఎదుగుతున్న డివిజన్ ప్రెస్ క్లబ్ ఇదే స్థాయిలో మంథని, కమాన్ పూర్, ముత్తారం మండలాల స్థాయిలో గొప్ప పేరుతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

సీనియర్ పాత్రికేయులు అక్కల నారాయణ మాట్లాడుతూ నూతన కమిటీ పాత్రికేయులకు స్పూర్తిగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సంవత్సర కాలం క్రితం ఏర్పాటైన మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ అందరి సభ్యుల కృషితో ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక సంవత్సరం సమయంలో కొన్ని పొరపాట్లు జరిగినా వాటిని అధిగమించి, ఇంతకు ముందు జరిగిన అటు పోట్లు తట్టుకొని జరిగిన పొరపాట్లు మళ్ళీ జరుగకుండా మెజారిటీ సభ్యుల అభిప్రాయాల మేరకు క్లబ్ సభ్యుల సంక్షేమం కోసం పాటు పడతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్య వర్గాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు మెడగొని రాజమౌళి గౌడ్, మల్యాల దేవేందర్, అనుము వీర స్వామి, ఎగోలపు సంతోష్ గౌడ్, అమ్ము శ్రీనివాస్, కాసర్ల శంకర్, ఎండీ. సుభాన్, రావుల రాజ్ కుమార్, మంథని లక్ష్మణ్, మాటేటి కుమార్, సడవలి, కాసు తిరుపతి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.