15 May, 2026 | 11:40 AM

Breaking News

నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం   •   గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత   •   సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్పష్టత   •   NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు   •   మైనర్ బాలికపై లైంగిక దాడి..   •   వాహన దారులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు   •   యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం   •   మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్   •   యువతను వ్యసనాలకు దూరం చేసేందుకే క్రికెట్ టోర్నమెంట్   •   గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి   •  

యువతను వ్యసనాలకు దూరం చేసేందుకే క్రికెట్ టోర్నమెంట్

15-05-2026 10:14 AM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో యువత చెడు వ్యసనాలు, సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో క్రికెట్ టోర్నమెంట్ (పెద్దమల్లారెడ్డి ప్రీమియర్ లీగ్) నిర్వహిస్తున్నారు. వేసవి సెలవుల్లో చిన్నా, పెద్దలు ఫోన్లకు పరిమితమవుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 

ఈ సందర్భంగా సర్పంచ్ కోడూరి సాయగౌడ్ మాట్లాడుతూ యువత క్రీడల వైపు మొగ్గుచూపేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ క్రీడలు ఆడటం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా మారడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. టోర్నమెంట్ నిర్వహణకు గ్రామ పెద్దలు, పాలకవర్గ సభ్యులు ముందుకు వచ్చి అవసరమైన సౌకర్యాలు కల్పించారు. గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొనడంతో గ్రామంలో క్రీడా సందడి నెలకొంది. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చైతన్య, కొండల్ రెడ్డి, వార్డు సభ్యుడు ఈర స్వామి, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.