15 May, 2026 | 2:53 AM

గో రక్షణ పేరుతో దాడులు చేస్తే కఠిన చర్యలు

15-05-2026 01:26 AM

జిల్లా ఎస్పీ నితిక పంత్

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 14(విజయక్రాంతి): గో రక్షణ పేరుతో ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని జిల్లా ఎస్పీ నితిక పంత్ హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గో రక్షణ కమిటీ సభ్యులతో నిర్వ హించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆవులు, దూడల అక్రమ రవాణాను అడ్డుకునే పేరుతో వ్యక్తులపై దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి చర్యలు చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.

అక్రమ రవాణా గమనించిన వెంటనే 8712670505, 8712670557 నంబర్లకు, స్థానిక పోలీస్ స్టేషన్కు లేదా డయల్-100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.జిల్లా సరిహద్దుల్లో 14 చెక్పోస్టులు ఏర్పాటు చేసి మూడు షిఫ్టుల్లో పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. పశువుల అక్రమ రవాణా, అమ్మకం లేదా వధకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీష్ పాల్గొన్నారు.