7 March, 2026 | 6:21 AM

ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిచేది యుద్ధం

07-03-2026 02:03 AM

యుద్ధం పర్యావసానాల్లో సంభవించేది ఒక్క ప్రాణనష్టం మాత్రమే కాదు. అది ఒక దేశ ఆర్థిక వెన్నెముకను పూర్తిగా విరిచేసే మహమ్మారి. రష్యా- ఉక్రెయిన్ ఘర్షణలు మొ దలుకొని, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వరకు ప్రతి యుద్ధం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నదే. ఆధునిక కాలంలో దేశాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండటం వల్ల, ఏ చిన్న ప్రాంతంలో యుద్ధం జరిగినా దాని ప్రభా వం,

బాధిత దేశాలతోపాటు ఇతర దేశాల సామాన్యులపైనా పడుతున్నది. ఉత్పత్తి రంగం స్తంభించిపోవడం, సరఫరా గొలు సు తెగిపోవడంతో పాటు ద్రవ్యోల్బణం పెరిగి దేశాల ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటున్నది. యుద్ధం వల్ల కలిగే విధ్వంసం నుంచి కోలుకోవడానికి దేశాలకు దశాబ్దాల కాలం పడుతోంది. యుద్ధం వల్ల ప్రగతి ప థంలో నడవాల్సిన దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి.

మొదటి ప్రపంచ యుద్ధం నుంచి

చారిత్రక కోణంలో చూస్తే 1914లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధం మానవ చరిత్రలో ఒక పెద్ద కుదుపు. ఆ ఘోర యుద్ధానికి ముగింపు పలికేందుకు 1919 జూన్ 28న వర్సాయ్ శాంతి ఒప్పం దం కుదిరినప్పటికీ, శతాబ్దం గడిచినా ప్రపంచం ఆ యుద్ధ భయాల నుంచి ఆ యా దేశాలు పూర్తిగా బయటపడలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా- ఉక్రెయి న్ యుద్ధం అంతర్జాతీయ భద్రతా వ్యవస్థకు కొత్త సవాళ్లు విసురుతున్నది.

రెండో ప్రపంచ యుద్ధం అనంతరం 1944లో ఏర్పడిన బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థ దశాబ్దాల పాటు అమెరికన్ డాలర్ ఆధారంగా ప్ర పంచ వాణిజ్యాన్ని శాసించింది. ఇటీవల రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలు ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను అన్వేషిస్తున్నా యి. స్థానిక కరెన్సీల్లో వాణిజ్యాన్ని పెంచ డం ద్వారా పశ్చిమ దేశాల ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతున్నాయి. ప్రపంచ భద్రతలో అణు ఆయుధాల నియంత్రణ మరో కీలక అంశంగా మారింది. 

పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలు

జర్మనీ, బ్రిటన్, జపాన్ వంటి దేశాలు తమ సామ్రాజ్యవాద కాంక్షతో, ఆధిపత్యం కోసం చేసిన యుద్ధాల్లో ఆర్థికపరమైన న ష్టాలను చవిచూశాయి.  ముఖ్యంగా జర్మనీ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కుదిరిన వర్సాయ్ ఒప్పందం ప్రకారం జర్మనీ భారీ గా యుద్ధ నష్టపరిహారం చెల్లించాల్సి వ చ్చింది. 1920వ దశకంలో జర్మనీలో ద్ర వ్యోల్బణం ఎంతలా పెరిగిందంటే ఒక రొట్టె ముక్క కొనడానికి కూడా ప్రజలు బండ్ల నిండా కరెన్సీ నోట్లను తీసుకువెళ్లాల్సి వచ్చేది. 1923 నాటికి ఒక అమెరికన్ డాలర్ విలువ అక్షరాలా 4.2 ట్రిలియన్ మార్కులకు చేరుకుంది.

దీనివల్ల మధ్యతరగతి ప్రజల పొదుపు మొత్తం ఒక్క రాత్రి లోనే శూన్యమైపోయింది. దేశం మొత్తం నిరుద్యోగం, ఆకలితో అల్లాడిపోయింది. సూర్యుడు అస్తమించని రాజ్యం బ్రిటన్‌గా వెలుగొందినప్పటికీ రెండబు ప్రపంచ రెండు యుద్ధాల కారణంగా అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటన్ ప్రపంచానికి అప్పులు ఇచ్చే దేశంగా ఉండేది. కానీ, రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి ఆ దేశం రుణగ్రహీతగా మారిపోయింది. యుద్ధం కోసం బ్రిటన్ తన విదేశీ ఆస్తులన్నింటినీ విక్రయించడమే కాకుండా, అమె రికా నుంచీ భారీగా రుణాలు తీసుకుంది.

1945 నాటికి బ్రిటన్ అప్పు దాని మొత్తం జీడీపీలో 250 శాతానికి పైగా నమోదైంది. యుద్ధం తర్వాత ఆ అప్పులు తీర్చడానికి, దేశాన్ని పునర్నిర్మించడానికి బ్రిటన్ ప్రజ లు దశాబ్దాల పాటు రేషనింగ్ పద్ధతిలో ఆహారాన్ని తీసుకోవాల్సి వచ్చింది. బ్రిటన్ ఆర్థికంగా ఎంతలా బలహీనపడిందంటే తన వలస దేశాలకు స్వాతంత్య్రం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆసియాలోనే అగ్రరాజ్యంగా ఎదగాలనుకున్న జపాన్ పరిస్థితి మరింత భిన్నంగా ఉంది.

1930ల నుంచి చైనాతో యుద్ధం చేస్తూనే రెండో ప్రపంచ యుద్ధంలోకి దూకిన జపాన్ ఆర్థికంగా పూర్తిగా ధ్వంసమైంది. యుద్ధం ముగిసే నాటికి జపాన్‌లోని 40 శాతం పారిశ్రామిక ప్రాంతాలు, మౌలిక వసతులు బాంబు దాడుల వల్ల బూడిదయ్యా యి. 1945లో జపాన్ పారిశ్రామిక ఉత్పత్తి 1935 నాటి స్థాయితో పోలిస్తే కేవలం 10 శాతానికి పడిపోయింది. దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడి లక్షలాది మంది ఆకలితో మరణించే స్థితికి చేరుకున్నారు. యుద్ధం వల్ల జపాన్ తన భూభాగాలను కోల్పోవడమే కాకుండా తన కరెన్సీ విలువను పూర్తిగా కోల్పోయింది.

కేవలం అమె రికా అందించిన ఆర్థిక సాయం (మార్షల్ ప్లాన్ తరహాలో) వల్ల మాత్రమే జపాన్ మళ్లీ కోలుకోగలిగింది. ఫ్రాన్స్ కూడా ఈ యుద్ధాల వల్ల తీవ్రంగా నష్టపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం ఎక్కువగా ఫ్రాన్స్ భూభాగంపైనే జరగడం వల్ల అక్కడి వ్యవసాయ భూములు, ఫ్యాక్టరీలు పాడయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఆక్రమణకు గురైనప్పుడు ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.

1944 నాటికి ఫ్రాన్స్ జీడీపీ యుద్ధానికి ముందున్న స్థితిలో సగానికి పడిపోయిం ది. ఇలా ఏ దేశాన్ని తీసుకున్నా యు ద్ధం వల్ల పొందిన విజయాల కంటే కోల్పోయి న ఆర్థిక సంపదే ఎక్కువగా కనిపిస్తుం ది. దేశాల ఖజానాలు ఖాళీ అవ్వడమే కాకుం డా మేధో సంపద కూడా ఇతర దేశాలకు వలస పోవడం ఆ దేశాల భవిష్యత్తును అంధకారం చేసింది. ఈ గణాంకాలు చూస్తే యుద్ధం అనేది కేవలం సైనిక శక్తి ప్రదర్శన కాదని, అది ఒక దేశం యొక్క ఆర్థిక ఆత్మహత్య అని స్పష్టమవుతుంది.

అణు పరీక్షలపై పర్యవేక్షణ

1968లో రూపొందిన అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ), 1957లో ఏర్పడిన అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) అణు పరీక్షలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. 2015లో కుదిరి న ఇరాన్ అణు ఒప్పందం మధ్యప్రాచ్యం లో ఉద్రిక్తతలను తగ్గించడానికి ఒక దౌత్య ప్రయత్నంగా నిలిచింది. అయితే 2018లో అమెరికా ఆ ఒప్పందం నుంచి వైదొలిగిన తర్వాత మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుత అవసరాల కోసమేనని చెబుతున్నప్పటికీ, ప్రాంతీయ రాజకీయాలు మాత్రం వేడెక్కుతున్నాయి.

అణు యుద్ధ భయాలు పెట్టుబ డిదారుల్లో ఆందోళన కలిగిస్తూ ప్రపంచ ఆర్థికవృద్ధిని అడ్డుకుంటున్నాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నెలకొన్న అభద్రత ఇంధ న సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్న ది. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో సుమా రు 12 శాతం ఈ మార్గాల ద్వారానే జరుగుతున్నది. ఇటీవల భద్రతా ఆందోళనల కారణంగా నౌకాయాన సంస్థలు తమ మార్గాలను మార్చుకోవడంతో రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి.

దీని ప్రభావం నేరుగా చమురు ధరలపై పడుతున్నది. 1973 నాటి చమురు సంక్షేమం వంటి పరిస్థితి మళ్లీ తలెత్తుతుందా? అన్న ఆందో ళనలు ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇంధన ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశా న్ని తాకుతాయి.  ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మారిన యుద్ధ స్వరూపం

ఆధునిక సాంకేతిక యుగంలో యుద్ధ స్వరూపం కూడా మారిపోయింది. డ్రోన్లు, సైబర్ దాడులు, కృత్రిమ మేధస్సు ఆధారిత ఆయుధాలు ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఫిజికల్ యుద్ధం కంటే ముందే సైబర్ దాడుల ద్వారా ఒక దేశం యొక్క ఆర్థిక మౌలిక వసతులను, బ్యాం కింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రమాదం ఏర్పడింది. చరిత్ర చెబుతున్న పాఠం ఏమిటంటే, ఎలాంటి యుద్ధాలైనా చివరికి చర్చల ద్వారానే ముగుస్తాయి.

1978 నాటి క్యాంప్ డేవిడ్ ఒప్పందం, 1990ల నాటి ఒస్లో శాంతి ఒప్పందాలు దౌత్యపరమైన ప్రాముఖ్యతను నిరూపించాయి. శాశ్వత ఆర్థిక స్థిరత్వం యుద్ధాల ద్వారా రాదు. అది కేవలం శాంతి, పరస్పర విశ్వాసం, దౌత్య సంభాషణల ద్వారానే సాధ్యమవుతుంది. చివరగా ఒకటి మాత్రం నిజం. యుద్ధం ద్వారా లభించే విజయాలు ఎప్పు డూ తాత్కాలికమే. 

 సెల్: 9640466464