8 March, 2026 | 8:46 AM

అహింసా అలయన్స్ ఆధ్వర్యంలో 5కే వాక్

08-03-2026 01:47 AM

పరేడ్ గ్రౌండ్ నుంచి బుద్ధవిహార్ వరకు కార్యక్రమ నిర్వహణ

హైదరాబాద్, మార్చి 7(విజయక్రాంతి): సమాజంలో ప్రేమానురాగాలు, శాంతి, సక ల జీవుల పట్ల కరుణను పెంపొందించాలనే ఉద్దేశంతో ‘అహింసా అలయన్స్’ ఆధ్వర్యంలో నగరంలో భారీ శాంతి యాత్ర నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుండి మహేంద్ర హిల్స్‌లోని బుద్ధవిహార్ ఆలయం వరకు ఈ 5కే వాక్ అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య నిర్వాహకులు, అహింసా అలయన్స్ వ్యవస్థాపకులు సంతోష్ పు ల్లూరి నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ‘మన జీవితాలను అందంగా తీర్చిదిద్దుకోవడానికి కరుణ అనేది ఒక కీలకం వంటిది. తోటి మనుషులపైనే కాకుండా, ప్రతి జీవి పట్ల ప్రేమ, సానుభూతి, సామరస్యంతో మెలిగినప్పుడే నిజమైన శాంతి లభిస్తుంది’ అని పేర్కొన్నారు.విశేషంగా తరలివచ్చిన అతిథులు, విద్యార్థులు ఈ శాంతి యాత్రలో బౌద్ధ గురువులు తమ ఆశీస్సులను అందజేశారు.

ముఖ్యంగా దేవనారి పాఠశాలకు చెందిన సుమారు 200 మంది అంధ విద్యార్థులు ఈ నడకలో పాల్గొనడం అందరినీ కదిలించింది.వారి ఉత్సాహం, శాంతి పట్ల వారికున్న అంకితభావం చూసి సందర్శకులు ముగ్ధులయ్యారు. చూపు లేకపోయినా, మనసు నిండా శాంతిని నింపుకు ని వారు వేసిన అడుగులు ఈ యాత్రకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి.కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సంతోష్ పుల్లూరి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పోలీస్ వారికి, వాలంటీర్లకు, ప్రజ లకు అహింసా అలయన్స్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు.