6 May, 2026 | 10:03 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

నాన్న.. నేను బతుకుతానా?

08-03-2026 01:47 AM
  1. మూత్రపిండాలు చెడిపోయి, మృత్యువుతో పోరాడుతున్న పదేళ్ల ఏళ్ల ఆషిక్ 
  2. వైద్యానికి రూ.35 లక్షలు అవసరం
  3. దాతల సాయం కోసం ఎదురుచూపు

రంగారెడ్డి, మార్చి 7 (విజయక్రాంతి): అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన వయసు.. పుస్తకాల సంచీ వీపున వేసుకుని బడికి పరుగెత్తాల్సిన పాదాలు.. కానీ నేడు ఆ పసివాడు ఆసుపత్రి మంచంపై మృత్యువుతో పోరాడుతున్నాడు. రంగారెడ్డి జిల్లా చేగుర్ గ్రామంలో నివసిస్తున్న ఉత్తరప్రదేశ్ వలస కూలీలు రతన్ కుమార్, సుమన్ దేవి దంపతుల కుమారుడు ఆషిక్ (10). పానీపూరి అమ్ముకుంటూ తన కొడుకును గొప్పగా చదివించుకోవాలనుకున్న.

ఆ తండ్రి ఆశలపై విధి పిడుగు వేసింది. ఆషిక్ రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయడం లేదని, వెంటనే ’కిడ్నీ మార్పిడి చేయకపోతే ప్రాణాపాయమని వైద్యులు తేల్చి చెప్పారు. దానికి రూ.35 లక్షలు అవసరమని వైద్యులు చెప్పారు. ప్రభుత్వం, సామాజిక కార్యకర్తలు, సహృదయం గల దాతలు స్పందించి ఈ చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వివరాలకు 9392670065 నంబరులో సంప్రదించాలని కోరారు.