7 July, 2026 | 3:04 AM

ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలి

07-07-2026 01:03 AM

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్

మధిర, జూలై 6(విజయ క్రాంతి): ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని దెందుకూరు గ్రామంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, నమోదు ప్రక్రియను పరిశీలించి, ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకునేలా కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచనల మేరకు గ్రామంలో ఒక్క ఓటు కూడా కోల్పోకుండా, ప్రతి అర్హత కలిగిన ఓటరికి న్యాయం జరిగేలా గ్రామాలు, వార్డుల్లో నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కర్నాటి రామారావు, పులిబండ్ల చిట్టిబాబు, దెందుకూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు ఉట్ల రాంబాబు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.