సీపీఎం సీనియర్ నాయకులు గరుగుల నాగభూషణంకు ఘన నివాళి
సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు
సుజాతనగర్, జూలై6, ( విజయక్రాంతి): సుజాతనగర్ గ్రామం సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ గరుగుల నాగభూషణం ఆదివారం మృతి చెందారు. సోమవారం సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కున్సోత్ ధర్మ, పార్టీ కండువా కప్పి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సుజాతనగర్ ప్రాంతంలో 1980లో అమరజీవి కామ్రేడ్ కాసాని ఐలయ్య తో గరుగుల నాగభూషణం రైతు సంఘం నాయకుడిగా ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాల పోరాటం,కూలిపోరాటాల్లో గాని రైతుల పోరాటాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ గరుగుల నాగభూషణం అని కొనియాడారు. నాగభూషణం మన మధ్య లేకపోవడం పార్టీకి ఈ ప్రాంత ప్రజలకు తీరాన లోటని ఆయన అన్నారు. పార్టీ మండల కార్యదర్శి వీర్ల రమేష్,కార్యదర్శి వర్గ సభ్యులు నర్రా శివ రామక్రిష్ణ కాట్రాల తిరుపతిరావు గండమాల భాస్కర్ బచ్చలికూర శ్రీనివాస్ పాల్గొంటున్నారు.






