30 August, 2026 | 11:21 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

క్యూర్ పరిధిలో ఎకోటూరిజం అభివృద్ధి

07-07-2026 12:54 AM
  1. ఫ్యూచర్ సిటీలో అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలి
  2. యాదగిరిగుట్ట తరహాలో వికారాబాద్ వీరభద్రస్వామి దేవాలయం అభివృద్ధి
  3. పర్యాటక శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): క్యూర్ పరిధిలో ఎకోటూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదే శించారు. తారామతి బారామతిని టూరి జం ప్లేస్‌గా మరింతగా అభివృద్ధి చేయాలని, దుర్గంచెరువును పూర్తిస్థాయి పర్యా టక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అన్నారు. మంజీరా, దిల్‌కుషా గెస్ట్ హౌస్‌లను ఆధునికీకరించాలన్నారు. ఫ్యూచర్ సిటీ లో ఉన్న అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దాలని, అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.

ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో పర్యాటక శాఖ పైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్‌ను అభివృద్ధి చేయాలన్నారు. వికారాబాద్‌లో వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని, యాదగిరిగుట్ట తరహాలో టెంపుల్‌కి పాల క మండలిని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

క్యూర్ పరిధి లో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖ తో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలన్నారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహా లో నగరంలో ఎకోపార్క్ లు తీర్చి దిద్దాలన్నారు. అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్ట్ ల కోసం స్పెషల్ ఆఫీసర్ ను ఏర్పాటు చేసుకొని పనులను ముమ్మరం చేయాల న్నారు. పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జి ల ను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలు గా తీర్చిదిద్దాలన్నారు. బ్రిడ్జిలపైన పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయాలని సూ చించారు.

అవకాశం ఉంటే ట్రాఫిక్ మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలన్నారు. డిసెంబరులో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌పైన కసరత్తు ప్రారంభించాలని సీఎం సూచించారు. సమ్మిట్ కోసం డిపార్ట్మెంట్‌ల మధ్య సమన్వయం కోసం కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమీక్షకు సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి జయేష్‌రంజన్, సీఎంఓ ముఖ్యకార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, టూరిజం సెక్రటరీ వాణీప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి పాల్గొన్నారు.