21 July, 2026 | 7:55 AM

ఓటరు జాబితా సవరణ సర్ కార్యక్రమాన్ని విజయవం చేయాలి

20-07-2026 05:42 PM

- పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరం వెంకటేశ్వర రావు

​పినపాక,(విజయక్రాంతి): భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్ (Special Intensive Revision) కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  పేరం వెంకటేశ్వర రావు పిలుపునిచ్చారు. పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు  పాయం వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  తోట దేవి ప్రసన్నల ఆదేశాల మేరకు ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు.

​ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం అవసరం

​ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా నమోదయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాల్లోని ​బూత్ లెవెల్ అధికారులు, ​సర్పంచులు, ఉపసర్పంచులు ​వార్డు సభ్యులు ​గ్రామ ముఖ్య నాయకులు మరియు ప్రజాప్రతినిధులు ​పూర్తిస్థాయిలో సహకరిస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన కోరారు.

​గ్రామాల్లో విస్తృత అవగాహన

​గ్రామస్థాయిలో ప్రజలందరికీ ఈ ప్రత్యేక సవరణ డ్రైవ్  పై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేరం వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. అర్హత ఉండి ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా బీఎల్ఓలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.