25 August, 2026 | 9:58 PM

జిల్లా లీగల్ సెల్ కన్వీనర్‌గా వోడ్నాల రవీందర్

25-08-2026 07:18 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం పెద్దపల్లి జిల్లా లీగల్ సెల్ కన్వీనర్‌  గా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన  వోడ్నాల రవీందర్ ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వోడ్నాల రవీందర్ సుల్తానాబాద్ లో  మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన పెద్దపల్లి జిల్లా కన్వీనర్ పెంట రాజేష్‌తో పాటు జిల్లా కమిటీ సభ్యులకు, కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. వోడ్నాల రవీందర్ నియామకం పట్ల మంగళవారం సుల్తానాబాద్ కు చెందిన పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.