పారమితలో ప్రమాణ స్వీకార మహోత్సవం
కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్తపల్లి మండలం పద్మనగర్ లోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో ఇటీవల జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన విద్యార్థుల ప్రమాణ స్వీకార వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ ఇ ప్రసాదరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం క్రీడా పతాకాన్ని ఎగురవేసి, క్రీడా పరుగును నిర్వహించి క్రీడా జ్యోతిని వెలిగించారు. నూతనంగా ఎన్నికైన హెడ్ బాయ్, హెడ్ గర్ల్, స్పోర్ట్స్ హెడ్, కల్చరల్ హెడ్, డిసిప్లేన్ హెడ్, డిప్యూటీ హెడ్ లచే ప్రమాణ స్వీకారం చేయించారు. విద్యార్థుల సాంసృతిక, క్రీడా కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, రశ్మిత, అనుకర్ రావు, వి.యు.యం. ప్రసాద్, వినోద్ రావు, హన్మంతరావు, ప్రిన్సిపల్ గోపీకృష్ణ, సమన్వయకర్తలు నాగరాజు, రాము, పిఈటిలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






