25 August, 2026 | 11:06 PM

హిందీ భాషాభివృద్ధికి ప్రత్యేక చర్యలు

25-08-2026 09:46 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): పాఠశాలల్లో హిందీ భాషాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా హిందీ ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇంద్ర శేఖర్ , సహిందర్ నాథ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ ను మంగళవారం కలిసి విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేలా రాబోయే హిందీ దివస్ కార్యక్రమాన్ని హిందీ భాష ఉపాధ్యాయులందరితో కలిసి నిర్వహిస్తామని విద్యార్థులకు వివిధ విషయాలలో పోటీలు నిర్వహిస్తామని పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ ను ఫోరం ద్వారా అందిస్తామని అన్నారు. 

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ హిందీ ఫోరమ్ ఉపాధ్యాయులను అభినందించారు.  హిందీ బోధన విషయంలో మరింత మెరుగైన నైపుణ్యాలను ప్రదర్శించి హిందీ భాషలో విద్యార్థులు రాణించేలా కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల భాష అభివృద్ధికి హిందీ ఫోరం ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా హిందీ ఫోరం బాధ్యులు చింతల లింగం, చంద్రశేఖర్, బి ఎన్ గిరి,  శ్యాం కుమార్, వంశీధర్,  తదితరులు పాల్గొన్నారు.