జిల్లాల కొనసాగుతున్న VOAల నిరసన
28-05-2026 05:54 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఐకేపీ సంఘాల్లో విధులు నిర్వహిస్తున్న వీ ఏవోల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె 11 రోజుకు చేరుకుంది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఐకెపి కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్నారు మండల కేంద్రంలో నిర్వహించి సమ్మెకు స్థానిక నాయకులు సంఘీభావం తెలుపుతున్నారు మండలాల్లోసోన్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ముందు కొనసాగుతున్న ఐకెపి VOA ల సమ్మెకు గాంధీనగర్ గ్రామ సర్పంచ్ ఆమని-బస్వరాజ్ మద్దతు తెలిపారు. సమ్మెలో పాల్గొన్న వివోఏల సమస్యలను ఆవేదనలు తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే వివోఎ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వివోఏలు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.






